
Hyderabad, Feb 24: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు (Bus Accidents In Telugu States) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి. మిర్యాలగూడ ఘటన మరవకముందే సోమవారం మరో బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో మెుత్తం 40మంది ప్రయాణికులు ఉండగా.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మంటల్లో బస్సు దగ్ధం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఘటన
టైరు పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం
డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/Nx0JNZ93DP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. https://t.co/jgCxaAeuyd#AndhraPradesh #bus #accident…
— RTV (@RTVnewsnetwork) February 24, 2025
ఏపీలో బస్సు బోల్తా
తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.