US: అమెరికాలో సంచలన కేసు, రహస్యంగా 560 మృతదేహాల అవయువాలను విక్రయించి లక్షలు పోగేసిన మహిళ, నేరం రుజువు కావడంతో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు
శ్మశన వాటిక మాజీ ఓనర్ (Former Colorado funeral home owner) అయిన ఓ 46 ఏళ్ల మహిళ.. 560 శవాల శరీర భాగాలను విడదీసి, చనిపోయిన వారి బంధువుల అనుమతి లేకుండా (selling body parts without permission) ఆ శరీర భాగాలను విక్రయించింది.
అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగు చూసింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ (Former Colorado funeral home owner) అయిన ఓ 46 ఏళ్ల మహిళ.. 560 శవాల శరీర భాగాలను విడదీసి, చనిపోయిన వారి బంధువుల అనుమతి లేకుండా (selling body parts without permission) ఆ శరీర భాగాలను విక్రయించింది. తద్వారా వారిని మోసం చేసినందుకు శ్మశన వాటిక మాజీ ఓనర్ కి మంగళవారం ఫెడరల్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష (sentenced to 20 yrs) విధిస్తూ తీర్పు వెలువరించింది.
అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు.
గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమె 69 ఏళ్ల తల్లి షిర్లీ కోచ్ కూడా ఈ మోసానికి పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. ఆమెకు 15 సంవత్సరాల శిక్ష విధించింది. ఈమె ప్రధాన పాత్ర మృతదేహాలను నరికివేయడమేనని కోర్టు రికార్డులు చూపిస్తున్నాయి.
కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో సన్‌సెట్ మెసా’ అనే శశ్మాన వాటికలో అవయవదాన సేవలను మేగన్ హెస్ అనే మహిళ నిర్వహించేది. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఈ కార్యక్రమాల్లో ఆమెకు సహాయకారిగా ఉండేది. అయితే ఇరువురు మరింత డబ్బు కోసం వక్రమార్గం ఎంచుకున్నారు. అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు.
అక్కడ అంతా ఓపెన్ యవ్వారమే.. తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం
నిందితురాలి తల్లి షిర్లే అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని కోర్టు తేల్చింది. కొంత కాలానికి ఇరువురు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా దీన్ని పోలీసులు అభివర్ణించారు.
ఇదిలా ఉంటే హెస్ చేసిన చర్యలను ఆమె న్యాయవాది సమర్థించారు. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది.