US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో కూలిన చిన్న విమానం.. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు (వీడియో)
అమెరికా రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనను మరిచిపోకముందే అదే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది.
Newyork, Feb 1: అమెరికా (America) రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనను (US Plane Crash) మరిచిపోకముందే అదే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఆరుగురితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఫిలడెల్ఫియాలో కుప్పకూలింది. ఓ మాల్ సమీపంలో విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లకు నిప్పు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం శుక్రవారం సాయంత్రం రూజ్ వెల్ట్ మాల్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల లోపే విమానం ప్రమాదానికి గురైనట్టు అధికారులు తెలిపారు.
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
మొన్నటికి మొన్నే ప్రమాదం
మొన్నటికి మొన్న వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం, మిలటరీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. కాగా తాజా ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నట్టు ఎఫ్ఏఏ చెబుతుండగా, ఆరుగురు ఉన్నట్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్రటరీ సీన్ డఫీ నిర్ధారించారు. వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. మృతుల సమాచారం తెలియాల్సి ఉంది. విమానం కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.