Wealth Migration Report 2024: భారత్‌ను వదిలేస్తున్న 4,300 మంది మిలియనీర్లు, హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ రిపోర్టు-2024లో సంచలన విషయాలు

భారత్‌ నుంచి భారీ సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారంటూ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ వెల్లడించింది.

Indian millionaires (photo-Pixabay)

భారత్‌ నుంచి భారీ సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారంటూ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ వెల్లడించింది. ఈ నివేదికలో మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం.

గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు.అయితే భారత్‌ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది.ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది.   ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు

2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.దేశంలో భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపారావకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకొన్న తర్వాతనే ఇండియన్‌ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్టు హెన్లీ నివేదిక వెల్లడించింది.

గడిచిన మూడేండ్లలో 18,300 మంది మిలియనీర్లు భారత్ నుంచి వలసలు వెళ్లారు. వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టగలిగితే..ఒక్కో మిలియనీర్‌ పెట్టగలిగే కనీస పెట్టుబడి8.2 కోట్లుగా ఉంటుంది. దీని ప్రకారం మూడేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిన మొత్తం1,50,060 కోట్లుగా అంచనా వేయవచ్చు.