Hill Assist: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ద్విచక్ర వాహనానికి 'హిల్ అసిస్ట్'. మన భారత కంపెనీదే ఆ ఘనత.

దీనిలో హిల్ అసిస్ట్ తో పాటుగా మరో 3 అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఏదైనా ఎత్తైనా ప్రదేశానికి (Incline) బైక్ లేదా కార్ నడిపిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. బ్రేక్, ఎక్సిలరేటర్ సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాలి లేదా వాహనం వెనకకి జారిపోయే (Rolling down) ప్రమాదం ఉంటుంది. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యి వెనకనున్న వాహనానికి తగిలే సందర్భాలు ఎన్నో. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ వాహనంలో ఉండే ఒక వ్యవస్థనే 'హిల్ అసిస్ట్' (Hill Assist). అత్యంత ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఈ ఫీచర్ ప్రపంచంలోనే తొలిసారిగా తమ ద్విచక్ర వాహనంలో అందిస్తున్నట్లు '22 మోటార్స్' (22 Motors) సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ తమ ద్విచక్ర వాహనాల కోసం ఈ హిల్ అసిస్ట్ ఫీచర్ పేటెంట్ హక్కులను మే 9, 2019న దక్కించుకుంది.

ఎలా పనిచేస్తుంది?

ఎత్తైన ప్రదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ హిల్ అసిస్ట్ ఫీచర్ వాహనం వెనక్కి జారుతున్నప్పుడు బ్రేకులు వేసి నియంత్రిస్తుంది, అదే సమయంలో వాహనానికి కొంత ఏక్సిలరేషన్ అందించి వాహనం ముందుకు కదలడానికి ఉపకరిస్తుంది.

ఇండియాకు చెందిన 22 మోటార్స్ సంస్థ 'ఫ్లో' (FLOW) పేరుతో బ్యాటరీతో నడిచే స్కూటర్ ను 2018లోనే ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (FLOW) లో  హిల్ అసిస్ట్ తో పాటుగా రివర్స్ మోడ్ (Reverse Mode), క్రూజ్ మోడ్ (Cruise Mode) మరియు డ్రాగ్ మోడ్ (Drag Mode) అనే మరో మూడు ఫీచర్లను కూడా అందిస్తున్నారు.

ఎక్కడైనా బైక్ పార్కింగ్ చేసినపుడు కష్టపడి బైక్ ని వెనక్కి లాగకుండా ఆటోమేటిక్ గా 'రివర్స్ మోడ్' తో బయటకి తీయొచ్చు. ఎక్కడైనా స్కూటర్ ఆగిపోతే ఒక 3 కి. మీ వరకు 'డ్రాగ్ మోడ్' తో నెట్టుకురావచ్చు. ఇంతటి ఎక్సైటింగ్ ఫీచర్స్ ఉన్న ఈ స్కూటర్ ను 2019 లోనే మార్కెట్లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif