Audi Q7 Bold Edition: ఎస్ యూవీలో స్పెష‌ల్ ఎడిష‌న్ రిలీజ్ చేసిన ఆడి, నాలుగు క‌ల‌ర్స్ లో లిమిటెడ్ యూనిట్స్ మాత్ర‌మే ఉత్ప‌త్తి, ఆడి క్యూ7 బోల్డ్ పూర్తి ఫీచ‌ర్స్ ఇవీ!

ఈ కారు ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.

Audi Q7 (Photo Credit: Official Website)

New Delhi, May 21: ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన క్యూ7 ఎస్‌యూవీ కారులో స్పెషల్ ఎడిషన్ ‘చిరిస్టెన్డ్ ఆడి క్యూ7 బోర్డ్ ఎడిషన్’ (Audi Q7 Bold Edition) కారును ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఆడీ క్యూ7 బోల్డ్ ఎడిషన్ కారు బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ అండ్ రేర్‌లో బ్లాక్డ్ ఔట్ ఆడి రింగ్స్ తోపాటు గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్లె , బ్లాక్ విండో, ఓఆర్వీఎంస్, రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ కారు నాలుగు ఎక్స్‌టీరియర్ రంగులు – గ్లాసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ కారు లిమిటెడ్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

 

ఇంకా క్యాబిన్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 19-స్పీకర్ బీ అండ్ ఓ సౌండ్ సిస్టమ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ ప్లస్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్ తదితర ఫీచర్లు జత చేశారు. ఈ కారు ఏడు వేర్వేరు డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది. 3.0 లీటర్ల టర్బో చార్జ్‌డ్ వీ6 ఇంజిన్ విత్ 48వాట్ల మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్, హైబ్రీడ్ పవర్ ట్రైన్ సెటప్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 335 బీహెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, బ్రాండ్ ఐకానిక్ క్వాట్ట్రో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ద్వారా అన్ని వీల్స్‌కు పవర్ సరఫరా చేస్తుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif