Kawasaki Z900: భారత్ మార్కెట్లోకి మరొక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ ఎంట్రీ.. కవాసకి నుంచి 2024 ఎడిషన్ Z900 మోటార్ సైకిల్ విడుదల, దుమ్ము లేపుకుంటూ దూసుకుపోతుందంతే, దీని ధరెంతో తెలుసా?

Kawasaki Z900 | Pic: X

2024 Kawasaki Z900:  జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసికి అప్‌డేట్ చేయబడిన 2024 Z900 మోడల్‌ మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ యాంత్రికపరంగా 2023 వెర్షన్ వలె ఉంటుంది. అయితే పాత మోడల్‌తో పోలిస్తే, కొత్తది రూ. 9,000 ఎక్కువ. ఎక్స్-షోరూమ్ వద్ద 2024 కవాసకి Z900 బైక్ ధర రూ. 9.29 లక్షలుగా ఉంది.

2024 కవాసకి Z900 మెటాలిక్ స్పార్క్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే అనే రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది ఉన్నతమైన రోడ్ ప్రెజెన్స్ ను ప్రదర్శిస్తుంది, దూకుడైన బాడీవర్క్‌తో సరికొత్త Z900 బైక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

దీని డిజైన్ ఎలిమెంట్లను పరిశీలిస్తే, ఇది సింగిల్-పాడ్ LED హెడ్‌లైట్, సొగసైన LED టైల్‌లైట్, 17-లీటర్ల సామర్థ్యం కలిగిన దృఢమైన ఫ్యూయల్ ట్యాంక్, స్ల్పిట్ టైప్ సీట్లు, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ లను కలిగి ఉంది.

2024 కవాసకి Z900 ఇంజన్ సామర్థ్యం

2024 కవాసకి Z900 మోటార్ సైకిల్ లో 948cc ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు, ఇది అసిస్ట్ - స్లిప్పర్ క్లచ్‌కి లింక్ చేయబడింది. ఈ ఇంజన్ 9,500rpm వద్ద 123.6bhp శక్తిని మరియు 7,700rpm వద్ద 98.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లను పరిశీలిస్తే, ఈ బైక్‌లో రెండు పవర్ మోడ్‌లు, మూడు రైడింగ్ మోడ్‌లు, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ మరియు నాన్-స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి “రైడియాలజీ” యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ TFT డిస్‌ప్లే ఉన్నాయి.

కవాసకి Z900 డన్‌లప్ టైర్‌లతో కూడిన 17-అంగుళాల చక్రాలపై పరుగెడుతుంది. ముందు చక్రానికి డ్యూయల్ 300mm డిస్క్‌ బ్రేకులు, వెనకచక్రానికి డ్యూయల్-ఛానల్ ABSతో కూడిన సింగిల్ 250mm వెనుక డిస్క్ బ్రేక్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందువైపు USD ఫ్రంట్ ఫోర్క్స్, వెనకవైపు మోనోషాక్‌ ఉన్నాయి, ఈ సెటప్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌లో ఉంచబడింది.

సెగ్మెంట్లో, కవాసకి Z900 భారతీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్, BMW F900R మరియు ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ వంటి మోటార్ సైకిళ్లకు పోటీనిస్తుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif