Burgman Street Scooter: బిఎస్6 ప్రమాణాలతో సుజుకి నుండి బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
ఈ స్కూటర్ లోని ఫ్యుఎల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ స్టార్ట్ మరియు కిల్ స్విచ్ ఫీచర్, శీతాకాలం లేదా చల్లని పరిస్థితుల్లో కూడా వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా పవర్ సప్లై చేస్తుంది.....
జపాన్ అటోమొబైల్ మ్యానిఫాక్ఛరింగ్ సంస్థ సుజుకి (Suzuki), బిఎస్6 ప్రమాణాలతో కూడిన కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్‌ను (BS-VI Burgman Street Scooter) సోమవారం భారత మార్కెట్లో (India) అధికారికంగా విడుదల చేసింది. కొత్త వెర్షన్‌ను ప్రారంభించడంతో, బర్గ్‌మన్ స్ట్రీట్ యొక్క బిఎస్ 4 వెర్షన్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రకటించింది.
కొత్త సుజుకి బిఎస్6 బర్గ్‌మన్ స్ట్రీట్ ప్రీమియం 125 సిసి స్కూటర్ కొత్త అప్‌డేట్స్ మరియు టెక్నాలజీతో లోడ్ చేయబడింది. ఈ స్కూటర్ లోని ఫ్యుఎల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ స్టార్ట్ మరియు కిల్ స్విచ్ ఫీచర్, శీతాకాలం లేదా చల్లని పరిస్థితుల్లో కూడా వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా పవర్ సప్లై చేస్తుంది. అలాగే డ్రైవింగ్ చేసే వారికి స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్ అల్యూమినియం 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ 124 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 6750 rpm వద్ద 8.7 PS పవర్ మరియు 5500 rpm వద్ద 10 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంది.
ఇక ఈ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఇంతకు ముందు వచ్చిన బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్ల లాగే ఉండి, కొన్ని మార్పులు చేశారు. యూరోపియన్ స్టైల్ డిజైన్ ఈ స్కూటర్ కు ప్రీమియం అప్పీల్, ప్రత్యేకమైన లుక్ ను కలిగి ఉంది. ముందు మరియు వెనుక, బాడీ-మౌంటెడ్ విండ్‌స్క్రీన్ మరియు పైకి మఫ్లర్ డిజైన్‌లో ఆకర్శణీయంగా ఉంది. ప్రయాణంలో సెల్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి వీలుగా DC సాకెట్‌తో గ్లోవ్ బాక్స్ కూడా ఇందులో అమర్చారు.
బర్గ్‌మన్ స్ట్రీట్ ఇప్పుడు నాలుగు ఉత్తేజకరమైన షేడ్స్‌లో - మెటాలిక్ మాట్ ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ మిరాజ్ వైట్, మెటాలిక్ మాట్టే బ్లాక్ నం 2 మరియు మెటాలిక్ మాట్టే బోర్డియక్స్ రెడ్ కలర్ అనే నాలుగు రంగులలో (గ్రే, వైట్, బ్లాక్ మరియు రెడ్) లభిస్తుంది.
ఇక 2020 మోడెల్ బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్ ధర దిల్లీ ఎక్స్ షోరూంలో రూ. 77,900/- గా నిర్ణయించబడింది. అంతకు ముందు వచ్చిన బిఎస్ 4 వెర్షన్‌తో పోలిస్తే ఈ స్కూటర్ ధర ఇప్పుడు సుమారు రూ. 7,000 ఖరీదైనది.