Mahindra Classic BSA Goldstar 650: మోటార్ సైకిల్స్ రంగంలోకి మహీంద్రా కంపెనీ, ఆగస్ట్ 15న తొలి బైక్ ను మార్కెట్లోకి తెస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా
ట్రాక్టర్లు, కార్ల తయారీలో పేరొందిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra)’ తాజాగా మోటారు సైకిల్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది. బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) బ్రాండ్ మద్దతుతో క్లాసిక్ లెజెండ్స్, వింటేజ్ మోటారు సైకిల్స్‌లతో భాగస్వామ్య ఒప్పందం కల మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మోటారు సైకిల్ తీసుకొస్తున్నది.
Mumbai, AUG 08: మినీ ట్రక్కులు.. ట్రాక్టర్లు, కార్ల తయారీలో పేరొందిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra)’ తాజాగా మోటారు సైకిల్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది. బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) బ్రాండ్ మద్దతుతో క్లాసిక్ లెజెండ్స్, వింటేజ్ మోటారు సైకిల్స్‌లతో భాగస్వామ్య ఒప్పందం కల మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మోటారు సైకిల్ తీసుకొస్తున్నది. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) కు 60 శాతం వాటా ఉంది. ‘బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650’ పేరుతో వస్తున్న ఈ మోటార్ సైకిల్ ఈ నెల 15న దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్స్ జరుగుతున్నాయి. క్రోమ్ అసెట్స్, రౌండ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్డ్ ఫ్యుయల్ ట్యాంక్, ఫ్లాట్ సీట్, వైర్ స్పోక్డ్ వెహికల్స్, ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ అండ్ హ్యాండ్లింగ్ కోసం మోడ్రన్ ఫీచర్లు జత చేశారు. ట్యూబులర్ స్టీల్ డ్యుయల్ క్రెడిల్ ఫ్రేమ్‌తో వస్తున్న మహీంద్రా బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ అప్ ఫ్రంట్ 41ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో రేర్‌లో ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్స్, ఫ్రంట్‌లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్స్, రేర్ లో 255 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. బ్రెంబో కాలిపర్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాదు.. ఈ మోటారు సైకిల్ ఫ్యుయల్ ట్యాంక్ 12 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది.
మహీంద్రా బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్, 652 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఎఫిషియెంట్ కంబుస్టన్ కోసం డీఓహెచ్సీ లేఔట్ విత్ ఫోర్ వాల్వ్స్, ట్విన్ స్పార్క్ ప్లగ్స్ జత చేశారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 45 బీహెచ్పీ విద్యుత్, 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. క్లచ్ ఎఫర్ట్ తగ్గింపు, స్మూత్‌గా గేర్ మార్పిడి కోసం ‘5-స్పీడ్ గేర్ బాక్స్ విత్ ఏ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్’ ఉంటుంది.ఇంకా ఈ మోటారు సైకిల్ ధర ఎంత అన్న సంగతి వెల్లడించలేదు.