Nissan X-Trail (Photo credits: X/@Nissan_India)

Mumbai, AUG 03: ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) దేశీయ మార్కెట్లో తన ఎక్స్-ట్రయల్ (X-Trail) కారును ఆవిష్కరించింది. కంప్లీట్‌లీ బిల్డ్ అప్ (సీబీయూ) మోడల్‌లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) ధర రూ.49.92 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టయోటా ఫార్చూనర్ (Toyota Fortuner), ఎంజీ గ్లోస్టర్ (MG Gloster), జీప్ మెరిడియన్ (Jeep Meridian), స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది నిసాన్ ఎక్స్-ట్రయల్. ఈ ఇంజిన్ గరిష్టంగా 163 పీఎస్ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డీ-స్టెప్ లాజిక్ కంట్రోల్, పెడల్ షిఫ్టర్స్ తోపాటు థర్డ్ జనరేషన్ ఎక్స్‌ట్రానిక్ సీవీటీతో వస్తున్నదీ కారు. ఫ్యుయల్ మైలేజీ కోసం 12వీ ఏఎల్ఐఎస్ (అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్) మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ జత చేశారు.

 

రెనాల్ట్-నిసాన్ అలయెన్స్ ఆధారంగా సీఎంఎఫ్-సీ ప్లాట్ ఫామ్ పై రూపుదిద్దుకున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ కారు భారత్ మార్కెట్లోకి 7-సీటర్ అవతార్‌లో వస్తోంది. ఫ్లోటింగ్ రూఫ్, వీ-మోషన్ గ్రిల్లె, ఎల్ఈడీ యూనిట్లతో కూడిన హెడ్ లైట్స్, డీఆర్ఎల్స్, రేర్ లో స్ప్లిట్ టైల్స్ ఉంటాయి. 20-అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ వస్తున్న ఈ కారు మూడు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు – పెరల్ వైట్, డైమండ్ బ్లాక్, చాంపేన్ సిల్వర్ రంగుల్లో వస్తోంది.

Maruti Suzuki Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 23 నెలల్లో 2 లక్షల సేల్స్‌తో సరికొత్త రికార్డు  

నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) 8- అంగుళాల నిసాన్ కనెక్ట్ డిస్ ప్లే స్క్రీన్ కంపాటిబుల్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే (వైర్ లెస్), 12.3 అంగుళాల టీఎఫ్ టీ మల్టీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, వైర్ లెస్ చార్జర్, సెవెన్ ఎయిర్ బ్యాగ్స్, పనోరమిక్ సన్ రూఫ్, 360-డిగ్రీ కెమెరా వ్యూ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్లో మూడేండ్లు లేదా లక్ష కి.మీ వారంటీ, అదనంగా మూడేండ్ల ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్, రెండేండ్ల నుంచి మూడేండ్ల వరకూ ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది.