Car Prices to Rise from January: కొత్త ఏడాది కారు కొంటే జేబుకు చిల్లులే, ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన దేశీయ దిగ్గజలు, ఎంత పెంచుతారనేది సస్పెన్స్
జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ , లగ్జరీ కార్ల సంస్థ ఆడీ వెల్లడించాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
కొత్త ఏడాదిలో కార్ల ధరలు రెక్కలు రానున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ , లగ్జరీ కార్ల సంస్థ ఆడీ వెల్లడించాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి.
కమోడిటీ ఉత్పత్తుల ధరలు అధికమవడం, ద్రవ్యోల్బణ పెరగడంతో ధరలపై తీవ్ర ఒత్తిడి పడిందని, దీంతో ధరలు పెంచకతప్పడం లేదని మారుతి వర్గాలు వెల్లడించాయి. ఎంత శాతం మేర పెంచేదానిపై సంస్థ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల లోపు విక్రయిస్తున్నది.
ఒక్క రీచార్జ్ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది
ఉత్పత్తి వ్యయం అధికంకావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే జనవరి 1 నుంచి అన్ని మాడళ్ల విలువలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది. సరఫరా కోసం అయ్యే ఖర్చులు అధికమవడం, మరోవైపు ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లను ఆయా మాడళ్ల ధరలను సవరించాల్సి వచ్చిందని ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సంస్థ రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల లోపు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.
సాధ్యమైనంత మేరకు వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం ద్వారా, కొనుగోలుదార్లపై భారాన్ని తగ్గించాలని అనుకున్నాం. అయినప్పటికీ ధరల పెంపు రూపంలో కొంత వ్యయ భారాన్ని బదిలీ చేయాల్సి వస్తోంద’ని మారుతీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది. కాగా మారుతీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ 0.8 శాతం మేర ధరలను పెంచింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2.4 శాతం పెంచింది.
టైటన్ కంపెనీలో 3 వేల ఉద్యోగాలు, రానున్న ఐదేళ్ల కాలంలో నియామకాలు చేపడతామని తెలిపిన టాటా కంపెనీ
టాటా మోటర్స్ కూడా జనవరి నుంచి అమలులోకి వచ్చేలా ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరలను సవరించాలనుకుంటున్నది. ప్రస్తుతం సంస్థ రూ.5.6 లక్షల నుంచి రూ.25.94 లక్షల లోపు వాహనాలను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ ధరలను ఎంతమేర పెంచబోతున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
.
దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాహన ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరల ఆధారంగా ధరలను పెంచకతప్పడం లేదని మహీంద్రా సీఈవో నలినికాంత్ గొల్లగుంట తెలిపారు. ఎంతమేర పెంచేది మాత్రం వచ్చే నెల చివర్లో వెల్లడించనున్నది సంస్థ. అలాగే మరో లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా ధరల పెంపుపై ఆలోచిస్తుమంటున్నట్లు పేర్కొంది.