MG Astor Prices Hike: రూ. 27 వేలు పెరిగిన ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ కారు ధర, ఈ ఏడాదిలో పెరగడం ఇది నాలుగోసారి..

49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

MG Astor

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో  ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఎంజీ ఆస్టర్ (MG Astor) సావీ ప్రో 1.3 టర్బో ఏటీ (సాంగ్రియా రెడ్) వేరియంట్, సీవీటీ (ఐవోరీ), 1.5 సీవీటీ (సాంగ్రియా రెడ్) మోడల్ కార్ల ధరలు రూ.27 వేలు పెరుగుతాయి. మరోవైపు షార్ప్ ప్రో 1.5 లీటర్ల సీవీటీ (ఐవోరీ) ధర రూ.26 వేలు పెరుగుతుందని ఎంజీ మోటార్స్ తెలిపింది. ఇక సెలెక్టెడ్ 1.5 సీవీటీ (ఐవోరీ) ధర రూ.21 వేలు, షార్ప్ ప్రో 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐవోరీ) వేరియంట్ రూ.24 వేలు పెరుగుతాయి.  సెలెక్ట్ 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐవోరీ), షైన్ 1.5 లీటర్ల మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐవోరీ) వేరియంట్ ధరలు రూ.20 వేలు పెరుగనున్నది.

త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..

కాగా ఈ ఏడాది జూన్ లో ఎంజీ ఆస్టర్ కారు ధర రూ.26,800 పెంచింది. ఎంజీ ఆస్టర్ కారు ధర రూ.9.98 లక్షల నుంచి రూ.18.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హై రైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది ఎంజీ ఆస్టర్.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif