MG Hector New Variants: రెండు సరికొత్త వేరియంట్‌లలో ఎంజీ హెక్టార్ SUV విడుదల.. ఒకటి షైన్ ప్రో, మరొకటి సెలెక్ట్ ప్రో.. ఒక్కో వేరియంట్‌లో ఎన్నెన్నో ఫీచర్లు, వీటి ధర ఎంతో తెలుసా?

MG Hector SUV (Photo Credit: Official Website)

MG Hector New Variants: ఎంజీ మోటార్ ఇండియా తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన MG హెక్టార్ SUVలో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల ప్రవేశపెట్టింది.  'షైన్ ప్రో' అలాగే 'సెలెక్ట్ ప్రో' అనే పేర్లతో ఈ కొత్త వేరియంట్‌ వాహనాలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే డిజైన్ పరంగా గానీ, చుట్టుకొలతల పరంగా లేదా ఇంజన్ సామర్థ్యం పరంగా గానీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ రెండు వేరియంట్లు కూడా చూడటానికి ప్రామాణిక MG హెక్టార్ SUV వలే ఉంటాయి. కానీ వీటిలో అనేక కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేశారు. ఈ కొత్త వేరియంట్‌ల ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 16 లక్షల నుండి 17.30 లక్షల వరకు ఉన్నాయి.

MG హెక్టార్ షైన్ ప్రో, MG  హెక్టార్ సెలెక్ట్ ప్రో వేరియంట్‌లలో కొత్తగా ఎలాంటి ఫీచర్లు ఇచ్చారు. అదనపు మార్పులు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.

MG హెక్టార్ షైన్ ప్రో, MG హెక్టార్ సెలెక్ట్ ప్రో - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

MG హెక్టార్ షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో రెండు వేరియంట్‌ల ఇంటీరియర్ లో 7-అంగుళాల పూర్తి డిజిటల్ LCD క్లస్టర్‌తో వస్తాయి. అలాగే 14-అంగుళాల పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి, వైర్‌లెస్ Apple CarPlay & Android Auto , వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ అందిస్తున్నారు. ఇంకా, బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ (CVT 5-సీటర్)తో పాటు ఆల్-బ్లాక్ థీమ్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్‌తో వస్తాయి. స్మార్ట్ కీతో పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్‌తో పాటు డిజిటల్ బ్లూటూత్ కీ షేరింగ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.

వెలుపలి వైపు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్‌లు, LED బ్లేడ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌తో అందించబడ్డాయి. ఇవే కాకుండా.. సెలెక్ట్ ప్రో వేరియంట్లో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుండగా, షైన్ ప్రో వేరియంట్ సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. సెలెక్ట్ ప్రో వేరియంట్ 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటే, షైన్ ప్రోలో 17-అంగుళాల సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఫీచర్ల జాబితాలో ఇంకా.. క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్,  ఆల్ ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), హిల్ హోల్డ్ కంట్రోల్ (HAC), ABS + EBD, బ్రేక్ అసిస్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్- రియర్ డీఫాగర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు హై-స్పీడ్ వార్నింగ్ అలర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif