Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు..

ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

rumion-festive-edition 1.jpg

టొయోటా గ్లాన్జా, టైసర్, హైరైడర్ యొక్క పండుగ ఎడిషన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రూ.20,608 విలువ గల కాంప్లిమెంటరీ టయోటా జెన్యూన్ యాక్సెసరీ (టీజీఏ)తోపాటు రుమియాన్ ఫెస్టివ్ ఎడిషన్ కారు లభిస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజీ మాత్రమేనని టయోటా పేర్కొంది.

జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..

ఈ కారు ధర రూ.10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా, కియా కరెన్స్ వంటి కార్లతో టయోటా రుమియాన్ పోటీ పడుతుంది. దేశవ్యాప్తంగా టయోటా డీలర్ల వద్ద టయోటా రుమియాన్ ఎంపీవీ ఫెస్టివ్ ఎడిషన్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.పెట్రోల్, సీఎన్జీ మోడల్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తోపాటు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో కొనుక్కోవచ్చు. లీటర్ పెట్రోల్ మీద 20.51 కి.మీ, కిలో సీఎన్జీ గ్యాస్ మీద 26.11 కి.మీ మైలేజీ లభిస్తుంది.

టయోటా రుమియాన్ కారు ఫీచర్లు

గార్నిష్డ్ హెడ్ ల్యాంప్స్,

రేర్ బంపర్,

టెయిల్ గేట్,

నంబర్ ప్లేట్,

క్రోమ్ డోర్ విజర్స్,

రూఫ్ ఎడ్జ్ స్పాయిలర్,

మడ్ ఫ్లప్స్

ఇంటీరియర్ గా డీలక్స్ కార్పేట్ మ్యాట్స్