SBI Car Loan: కొత్త కారు కొంటున్నారా, జస్ట్ ఇంట్లో కూర్చొనే SBI Yono యాప్ ద్వారా కార్ లోన్ పొందడం ఎలాగో తెలుసుకోండి..

తాజాగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం సులభమైన రుణాలను అందిస్తోంది.

Reprasentative Image (Image: File Pic)

కొత్త కారు కొంటున్నారా, అయితే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బ్యాంకులు కూడా సులభంగా రుణాలను అందిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం సులభమైన రుణాలను అందిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకులకు వెళ్లి రుణాల కోసం వెళ్లకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కొత్త కారు కోసం రుణం పొందాలనుకునేవారికి మంచి ఆఫర్‌ అందిస్తోంది. ఇంటి వద్దనే ఉండి ఎస్‌బీఐ యోనో యాప్ (SBI YONO APP) ద్వారా రుణాన్ని పొందవచ్చు. తక్కువ వడ్డీకే రుణం అందిస్తోంది. ఎస్‌బీఐ నుంచి కారు కోసం తక్కువ వడ్డీకే రుణం పొందాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది.

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారిరు ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా గారీ, ఎస్‌బీఐ అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కారు కొనుగోలుపై 90 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 7.25శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తోంది. రుణం పొందాలంటే ఇతర ఛార్జీలేమి ఉండవు.