State Bank of India: ఇకపై ఎస్బీఐ ఏటిఎంలలో క్యాష్ విత్‌డ్రాకు ఓటీపీ ఎంటర్ చేయాలి. జనవరి1, 2020 నుంచి ఎస్బీఐ ఏటీఎంలలో ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ విధానాన్ని ప్రవేశపెట్టనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10,000 లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేయాల్సి వచ్చినపుడు ఖాతాదారుడి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏటీఎంలో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే క్యాష్ విత్‌డ్రా సాధ్యపడుతుంది....
Hyderabad, December 28: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కి సంబంధించి అన్ని ఏటీఎంలు 2020 జనవరి 1 నుండి వన్-టైమ్ పాస్ వర్డ్ (OTP) ఆధారిత నగదు ఉపసంహరణ (Cash Withdraw) వ్యవస్థకు మారుతున్నాయి. కాబట్టి, ఇకపై ఎస్బీఐ ఏటిఎం కార్డు ఉపయోగించేవారు పిన్ నెంబర్‌తో పాటుగా ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
దీని ప్రకారం జనవరి 1 నుంచి ఎస్బీఐ ఏటీఎం కార్డు (SBI ATM Card)ద్వారా రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేయాల్సి వచ్చినపుడు ఖాతాదారుడి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏటీఎంలో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే క్యాష్ విత్‌డ్రా సాధ్యపడుతుంది. అయితే ఈ కొత్త భద్రతా విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య (8 PM to 8 AM) విత్‌డ్రా చేసేటపుడు మాత్రమే వర్తిస్తుందని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
Here's SBI's Statement:
ఒక ఓటీపీ నెంబర్ ద్వారా ఒక విత్‌డ్రా మాత్రమే సాధ్యపడుతుంది. మరోసారి విత్‌డ్రా చేయాలనుకున్నపుడు మరోసారి కొత్త ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ OTP- ఆధారిత విధానం ద్వారా ఏటీఎంల వద్ద వినియోగదారుల యొక్క ఖాతా నుంచి అనధికార లావాదేవీల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది.
కాగా, ఈ విధానం ద్వారా ఎస్బీఐ వినియోగదారులకు ఏటీఎం వద్ద జరిగే మోసాల నుంచి, డెబిట్ కార్డు లేదా డెబిట్ కార్డు క్లోనింగ్ మోసాల నుంచి కొంతమేర ప్రయోజనం ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ఎందుకంటే, 'ఈ విధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మాత్రమే వర్తిస్తుంది, వేరే ఇతర బ్యాంకు ఏటీఎంలు ఉపయోగించినపుడు ఎలాంటి ఓటీపీ రాదు' అని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు.