Case Filed Against Varma KRKR: కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, కులాల మధ్య గొడవలు, చిచ్చు పెట్టేలా సినిమా, వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు
అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక ఈ వివాదం మరింత ముదిరింది.
Ananthapuram, October 28: కాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (kamma rajyamlo kadapa redlu)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక ఈ వివాదం మరింత ముదిరింది. ఈ సినిమా టైటిల్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా టైటిల్, కథపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్
కులాల మధ్య చిచ్చు పెట్టేలా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సినిమా టైటిల్ ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మన దేశంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను రాజ్యాంగబద్దంగా ఎన్నుకుంటారని కులాల పేరుతో కాదని నాగరాజు తెలిపారు.
కొన్ని సామాజికవర్గాల మనోభావాలను దెబ్బతీసేలా టైటిల్ ఉందని చెప్పారు. వెంటనే సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
3 గంటల్లో మూడు మిల్లియన్ల వ్యూస్
అయితే వర్మకు కేసులు ఇవేమి కొత్తవి కావు, గతంలో కూడా ఆయన అనేక రకాల కేసులు ఎదుర్కున్నారు. తను రూపొందించిన చాలా సినిమాలు వివాదాలు, కేసుల మధ్యనే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న కథను ఎంచుకుని కొందరు నేతలను టార్గెట్ చేస్తూ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలయిన మూడు గంటల్లోనే మూడు మిల్లియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
వర్మ ట్వీట్
ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. టీడీపీ నేత చంద్రబాబు ఈ మధ్య ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబును పోలి ఉన్న ఒకతను ఈ వీడియోలో ఉన్నాడు. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా ఇది నా క్రియేషన్ కాదు, ఎవరో నాకు పంపారంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు వర్మ.