Tamannaah Questioned By ED: ఈడీ విచారణకు తమన్నా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించే ఈ విచారణ. అసలేంటీ విషయం??
గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు.
Newdelhi, Oct 18: మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) స్కామ్ కు సంబంధించిన కేసులో ప్రముఖ హీరోయిన్ తమన్నాను (Tamannaah) ఈడీ గురువారం విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు. ఈడీ తమన్నాను దాదాపు 8 గంటలపాటు విచారించింది. అయితే, ఈ స్కామ్ తో డైరెక్ట్ గా తమన్నాకు లింకులు లేవు.. కానీ, మహాదేవ్ బెట్టింగ్ యాప్ (HPZ టోకెన్ యాప్) కు సంబంధించిన ఓ షోలో తమన్నా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమెను విచారించినట్టు సమాచారం. ఇప్పటికే ఇదే కేసులో రణబీర్ కపూర్, శ్రద్ధ కపూ ర్‌లను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
అసలేమిటీ యాప్?
మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్. బిట్ కాయిన్, క్రిప్టో కరేన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసినందుకు ఐపీసీ, ఐటీ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ యాప్ ను తమన్నా చట్టవిరుద్ధంగా ప్రచారం చేశారని ఈడీ అధికారులు విచారణకు పిలిచారు.