Pawan Kalyan: స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు..?, పవన్ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవేనా?
కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
Karnataka, Aug 8: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని..కానీ ప్రస్తుతం ప్రస్తుతం అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని అన్నారు. తాను సినిమాలకు సంబంధించిన వాడినేనని అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి సినిమాల్లో నటించేటప్పుడు ఇబ్బందులు పడేవాడినన్నాడు. అయితే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
దీంతో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బన్నీని ఉద్దేశించినవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా పుష్ప సినిమాతో వచ్చింది అల్లు అర్జున్ మాత్రమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కగా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఈ నేపథ్యంలో ఏపీ అటవీ శాఖ మంత్రిగా పవన్ చేసిన కామెంట్స్ వైరల్‌గ మారాయి. అసలే బన్నీ అంటే మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్‌కి ఈ కామెంట్స్ మరింత బూస్ట్ తెప్పించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?
ఇక కర్ణాటక పర్యటనలో భాగంగా ఏపీలోని చిత్తూరులో ఏనుగుల ద్వారా జరుగుతున్న నష్టం నేపథ్యంలో కుంకీ ఏనుగులను పంపించాలనే సాయం కోసం సీఎం సిద్దరామయ్యను కలిశారు పవన్.