AP Deputy CM Pawan Kalyan meets karnataka CM Siddaramaiah(X)

Karnataka, Aug 8:  కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అంతేగాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి వచ్చింది.

ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులు అవసరం కాగా ఇవి కర్ణాటకలో ఉన్నాయి. కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు తెప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సిద్ధరామయ్యను కోరారు పవన్. అలాగే కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖంద్రేతోనూ చర్చలు జరిపారు పవన్‌.

Here's Video:

 ఈ సమావేశంలో కుంకి ఏనుగుల మనుగడతో పాటు వాటి జీవన విధానంలో మార్పుపై చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిట్లు సమాచారం.  ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

Here's Tweet:

ఇప్పటికే ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాలను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు.