Marimuthu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ అసిస్టెంట్ డైరక్టర్ మారిముత్తు అనుమానాస్పద మృతి

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

Marimuthu Dies (photo-X)

తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్‌ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ డైరెక్టర్‌ మారిముత్తు మృతి చెందాడు. సెల్వరాజ్ దర్శకత్వం వహించి బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు సినిమాలకు మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్‌ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

మారిముత్తుకు శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్‌ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.