Bhairava Dweepam Re Release: బాలకృష్ణ సూపర్ ఫాంటసీ మూవీ రీ రిలీజ్‌, 4K క్వాలిటీలో మళ్లీ విడుదల కానున్న భైరవద్వీపం మూవీ, రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సింగీతం శ్రీనివాసరావు (Singitham srinivasrao) దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం 1994లో రిలీజయి భారీ విజయం సాధించింది.

Bhairava Dweepam Re Release

Hyderabad, July 26: ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలని, స్టార్ హీరోల మంచి మంచి సినిమాలని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ లకు (Re Releasing) అభిమానులు ఎగబడి మరీ వెళ్లడం, కలెక్షన్స్ కూడా బాగా వస్తుండటంతో ఇటీవల సినిమాల రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఫాంటసీ డ్రామా ‘భైరవ ద్వీపం’ (Bhairava Dweepam) త్వరలో రీ రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సింగీతం శ్రీనివాసరావు (Singitham srinivasrao) దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం 1994లో రిలీజయి భారీ విజయం సాధించింది. బాలకృష్ణ (Nandamuri balakrishna), రోజా (Roja) ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా కథ, పాటలు, కథనం అప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. కలెక్షన్స్ సాధించడమే కాక 9 నంది అవార్డులని గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది భైరవ ద్వీపం.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ క్లాసిక్‌ చిత్రం ‘భైరవద్వీపం’. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 14 ఏప్రిల్‌ 1994న విడుదలై గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా క్లాప్స్‌ ఇన్ఫోటెన్‌మెంట్‌ సంస్థ పి.దేవ్‌తో కలిసి చంద్రశేఖర్‌ కుమారస్వామి ఈ క్లాసిక్‌ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకుల కోసం సరికొత్త సొబగులు అద్ది 4కె క్వాలిటీతో ఆగస్టు 5న రీ రిలీజ్‌ (Bhairava Dweepam Movie Re Releasing) చేస్తున్నారు.

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు 

రావికొండల రావు రచించిన ఈ మ్యూజికల్‌ లవ్‌స్టోరీకి మాధవపెద్ది సురేష్‌ సంగీతం అందించారు. ఈ పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. రోజా, కైకాల సత్యనారాయణ, విజయ్‌కుమార్‌, రంభ, విజయ రంగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కబీర్‌లాల్‌.



సంబంధిత వార్తలు