Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

Credits: Twitter

Hyderabad, May 28: తెలుగు దేశం పార్టీ (Telugu Desham Party) వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Sr. NTR) శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ (Balakrishna), మనవడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నివాళులు (Tributes) అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇరువురూ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తున్నారని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అగ్రగామిగా నిలిచారన్నారు.

New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..

కుమారుడిగా జన్మించడం అదృష్టం

తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు టీడీపీని స్థాపించిన తన తండ్రి, అధికార పగ్గాలు చేపట్టాక పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. ఆయనకు కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Sengol Handover to PM Modi: ప్రధాని మోదీ చేతికి రాజదండం, ప్రధాని నివాసాకి వచ్చి అందజేసిన 20 మంది పీఠాధిపతులు కొత్త పార్లమెంట్ భవనం కోసం సర్వం సిద్ధం