Bathukamma Song: బాలీవుడ్ తెరపై బతుకమ్మ సాంగ్, సల్లూభాయ్ మూవీలో స్పెషల్ అట్రాక్షన్‌గా తెలంగాణ బతుకమ్మ, వీడియో సాంగ్ మీకోసం...
కేవలం తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారా? లేదంటే హిందీలోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మా (Bathukamma song)న్ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.
Mumbai, March 31: దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను (Salman Khan) గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ (EID) సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు (Kisi Ka Bhai Kisi Ki Jaan)సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా వెంకీ కీలకపాత్ర పోషించనుండటంతో తెలుగులోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా (venkatesh)నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట శ్రోతలను తెగు ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారా? లేదంటే హిందీలోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మా (Bathukamma song)న్ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.
ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో ‘వీ (Pooja Hegde)రుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్, రవి బస్రూర్, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.