Bhagavanth Kesari Teaser: తెలంగాణ యాసలో బాలయ్య దూకుడు.. ‘భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్
ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
Hyderabad, June 10: బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) సినిమా రూపొందుతోంది. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ (First Teaser) ను రిలీజ్ చేశారు. 'అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి' అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్ లోకి దిగిపోవడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. 'ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది' అనే బాలయ్య డైలాగ్ తో ముగించారు. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.
తారాగణం వీళ్లే..
బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. తన పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే, శ్రీలీల అంగీకరించినట్టుగా చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను 'దసరా'కి విడుదల చేయనున్నారు.