Brahmanandam Auto Biography: కామెడీ కింగ్ బ్రహ్మానందం ఆత్మ‌క‌థ వ‌చ్చేసింది! మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ‌, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి ..

ప్ర‌స్తుతం ఈ పుస్తకం ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్ కార్ట్‌లో అందుబాటులో ఉంది.

Brahmanandam Auto Biography (PIC@ Chiranjeevi X)

Hyderabad, DEC 28: తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్‌లో బ్రహ్మానందం (Brahmanandam) అందరికంటే ముందుంటాడు. ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా కూడా బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. ప్రత్యక్షంగా ఆయన కనిపించకపోయినా మీమ్స్ రూపంలో ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడు బ్రహ్మానందం. రీసెంట్‌గా ‘కీడా కోలా’ అనే సినిమాలో తాత పాత్ర‌లో మెరిసి అంద‌రిని అల‌రించాడు. అయితే ఈ లెజెండ‌రీ క‌మెడియ‌న్ ఆత్మకథ (Brahmanandam Auto Biography) మీద ఒక పుస్తకం వ‌చ్చింది. ఈ ఆత్మకథను స్వ‌యంగా బ్రహ్మానందంమే రాయ‌గా.. ఈ పుస్త‌కానికి ‘నేను .. మీ బ్రహ్మానందం’ అనే టైటిల్ పెట్టాడు.

 

బ్రహ్మానందం జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ పుస్తకం ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్ కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ పుస్త‌కాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వెళ్లి స్వ‌యంగా బ్రహ్మానందంమే చిరుకు అంద‌జేశాడు. ఈ సంద‌ర్భంగా ఆ అనంద‌పు క్ష‌ణాల‌ను పంచుకుంటూ చిరంజీవి ఒక స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.

”నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిచటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు , మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను.” అంటూ చిరు ఎక్స్‌లో రాసుకోచ్చాడు.