Brahmastra: బ్రహ్మస్త్ర వచ్చేస్తోంది, డిసెంబర్ 4, 2020న ప్రేక్షకుల ముందుకు, ఇండియాలో తొలి మైథలాజికల్ త్రయాలజీ డ్రామా మూవీ, 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి నాగార్జున ఎంట్రీ
ఈ చిత్రాన్ని డిసెంబర్ 4 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్విట్టర్ వేదికగా బ్రహ్మస్త్ర టీం ప్రకటించింది.
Mumbai, Febuary 2: బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ, (Ayan Mukerji) ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ (Karan Johar) క్యాంబోలో రూపుదిద్దుకుంటున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్విట్టర్ వేదికగా బ్రహ్మస్త్ర టీం ప్రకటించింది.
ఇందులో అమితాబ్ (Amitabh Bachchan) రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నాగార్జున (Nagarjuna) అలియా భట్ (Alia Bhatt) ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భారత దేశంలో మొట్టమొదటి మైథలాజికల్ త్రయాలజీ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఈ సినిమా హిందీ టైటిల్ లోగోను ‘ప్రయాగలో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి ( SS Rajamouli) తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన విషయం విదితమే. ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ లోగో చాలా బాగుందని చెబుతూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశాడు.
Here's rajamouli ss Tweet
కాగా బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాత కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆచనతో పాటుగా హీరు జోహర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Here's Amitabh Brahmastra Tweet
Here's Karan Johar Brahmastra Tweet
బ్రహ్మస్తం మోషన్ టైటిల్ లోగో ఆదిలోనే ఆసక్తిని రేపింది. అందులో డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ‘మన ఉనికి గర్వం. చరిత్రకు అది శిఖరం. బ్రహ్మండంలో ఉన్న శక్తి అంతటికి స్థావరం. అదే బ్రహ్మస్త్రం' అంటూ వచ్చే డైలాగ్స్ మోషన్ టైటిల్‌లో వినిపించాయి. యే జవానీ హై దీవాని చిత్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తీస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి సంబంధించిన మంచి రెస్పాన్స్ వచ్చింది.
గతంలో శివ, క్రిమినల్, ఖుదాగవా లాంటి పలు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులను నాగార్జున మెప్పించారు. నేను బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నాను. సుమారు 15 ఏళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం జరుగుతున్నది. చివరిగా నేనే ఏ బాలీవుడ్ చిత్రంలో నటించానో నాకే గుర్తు లేదు అని నాగార్జున మీడియాతో ఓ సందర్భంలో అన్నారు.
ఎట్టకేలకు మరో భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 4న వస్తోంది. అగ్ర హీరోలు నటిస్తున్న ఈ సినిమా దక్షిణాది భాషల్లో కూడా విడుదలవుతోంది. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు కనువిందును చేయనుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ,మళయాలంలో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.