Che Guvera of Hyd: చరిత్ర మరిచిపోయిన ఒక 'రెబల్ స్టార్' కథ మళ్ళీ వెలుగులోకి, స్టూడెంట్ లీడర్ 'జార్జ్ రెడ్డి' బయోపిక్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్

నిజానికి ఆవేశం ఉంటేనో, లేదా విప్లవ వీరుల వేషధారణ, వారి హావాభావాలను అనుకరిస్తేనో 'రెబల్' అనిపించుకోరు....

George Reddy Trailer Unveiled | Photo Credits: Silly Monks Studios.

చెగువెరా (Che Guvera), భగత్ సింగ్ (Bhagat Singh) వీరి పేర్లు స్మరించుకుంటే మనలో ఒక తిరుగుబాటు తత్వం, ఒక విప్లవ స్పూర్థి రగులుతుంది. ఇప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు అలాంటి ఆవేశాన్ని చూపిస్తూ తాము కూడా అలాంటి విప్లవ నాయకులమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఆవేశం ఉంటేనో, లేదా విప్లవ వీరుల వేషధారణ, వారి హావాభావాలను అనుకరిస్తేనో 'రెబల్' అనిపించుకోరు. ఆ ఆవేశానికి ఒక అర్థం ఉండాలి, వారి ఆలోచనలకు ఒక స్పష్టత ఉండాలి. అన్నింటికీ మించి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వారు చేసే పోరాటంలో నిజాయితీ ఉండాలి. ఇలాంటి లక్షణాలు గల ఒక స్టూడెంట్ లీడర్ 'హైదరాబాద్ చెగువెరా' (Che Guvera of Hyderabad) గా పేరుగాంచాడు, అతడే 'జార్జ్ రెడ్డి' (George Reddy). విద్యార్థుల మరియు ఇతర సామాజిక సమస్యలపై పోరాడే ఈనాడు మనం చూసే స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్ లీడర్లకి ఇప్పటికీ జార్జ్ ఒక ఐకాన్, చాలా సినిమాల్లో హీరోలు చేసే స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్స్ చాలామటుకు జార్జ్ రెడ్డి క్యారెక్టర్ నుంచి స్పూర్థిగా తీసుకోబడినవే.  అసలు జార్జి రెడ్డి ఎవరు? ఆయన కథేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

1970ల నాటి ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ మరియు స్టూడెంట్ యూనియన్ లీడర్ అయిన జార్జి రెడ్డి నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని తెలుగులో 'జార్జి రెడ్డి' అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇందులో 'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ (Sandeep Madhav) అలియాస్ సాండీ హీరోగా టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదే ఆ ట్రైలర్

ఈ ట్రైలర్‌లో చూస్తే హీరోను ఒక బ్రిలియంట్ స్టూడెంట్‌గా చూపిస్తూనే మరోవైపు బ్లేడ్ ఫైట్, బాక్సింగ్ చూపిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో జార్జ్ రెడ్డి కూడా చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్, అతడికి బాక్సింగ్  తెలుసు,  బ్లేడ్ ఫైట్ కూడా నేర్చుకున్నాడు . అందుకే ఈ సినిమాలో ఫైట్స్ నేచురల్‌గా ఉండేలా డైరెక్టర్ జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. ట్రైలర్‌‌లో బీజీఎం కూడా వింటేజ్- మోడ్రెన్ మ్యూజిక్‌తో ట్రైలర్‌కు ఒక స్టైలిష్ అప్పీల్‌ను ఇచ్చింది. కథ ప్రకారం సినిమా పూర్తిగా ఉస్మానియా యూనివర్శిటీలో సాగుతుంది కాబట్టి ఓయూ సెట్ లేదా వీఎఫెక్స్‌తో మేనేజ్ చేసినట్లుగా అర్థమవుతుంది.

'జీనా హైతో మర్ నా సీఖో' అనేది జార్జ్ రెడ్డి నినాదం, డైలాగ్స్ సింపుల్‌గా, నేచురల్‌గా పెడుతున్నట్లు అర్థమవుతుంది. జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సందీప్ మాధవ్ తో పాటుగా ముస్కాన్ హీరోయిన్ పాత్రలో, అభయ్ బేతిగంటి, సత్యదేవ్, శత్రు, మనోజ్ నందం లాంటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనేది పై లింక్ లో చూడొచ్చు, ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 27న 'జార్జ్ రెడ్డి' మూవీ థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.