Sye Raa Narasimha Reddy Teaser: 'చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ, ఈ చరిత్ర మనతోనే మొదలవ్వాలి'. సైరా నరసింహా రెడ్డి టీజర్ విడుదల. చరిత్ర మరిచిపోయిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో గర్జించిన మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు టీజర్ కు వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ అందివ్వగా, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ, మళయాల వెర్షన్ లకు మోహన్ లాల్ మరియు కేజీఎఫ్ స్టార్ యష్ కన్నడ వెర్షన్ కు వాయిస్ ఓవర్ ను అందజేశారు....
'చరిత్ర స్మరించుకుంటుంది ఝాన్సీ లక్ష్మీభాయి, చంద్రశేఖర్ అజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని, కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు...' అంటూ గంభీరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' టీజర్ విడుదలైంది.
మొన్న ఇండిపెండెన్స్ డే రోజున మేకింగ్ వీడియో విడుదల చేశారు, నిన్న పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ వీడియోను రిలీజ్ చేశారు. నేడు చిరంజీవి పుట్టినరోజు మరో రెండు రోజుల ముందుగా సైరా టీజర్ విడుదల చేయడంతో ఇక మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
టీజర్‌లోని పోరాట దృశ్యాలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఎంతో ఖర్చుకు, శ్రమకోర్చి జాగ్రత్తగా ఈ పోరాట దృశ్యాలను చిత్రీకరించారు.
1857 తిరుగుబాటుకు ముందే ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాడు తెలుగు వీరుడు, చరిత్ర మరిచిపోయిన స్వాతంత్య్ర సమరయోధుడు జీవిత విశేషాలను తెలియజేస్తూ ఈ సినిమా తెరకెక్కుతుంది. నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, ప్రత్యేక అతిథి పాత్రలు నర్సింహరెడ్డి గురువు గోశాయ్ వెంకన్న పాత్రలో బాలీవుడ్ షహన్ షా అమితాబ్ బచ్చన్, ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో అనుష్క కనిపించనున్నారు.
ఇక మిగతా ముఖ్య పాత్రలు వీరా రెడ్డిగా జగపతిబాబు, అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, సిద్ధమ్మగా నయనతార, మరియు లక్ష్మీ పాత్రలో తమన్నా నటిస్తున్నారు.
తాజా టీజర్‌ను మొత్తం 5 భాషల్లో విడుదల చేశారు. తెలుగు టీజర్‌కు వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ అందివ్వగా, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ, మళయాల వెర్షన్‌లకు మోహన్ లాల్ మరియు కేజీఎఫ్ స్టార్ యష్ కన్నడ వెర్షన్‌కు వాయిస్‌ను అందజేశారు.
భారీ బడ్జెట్‌తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'సైరా' విడుదల కాబోతుంది.