IFFI Award For Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తింపు.. అవార్డు సంతోషాన్ని కలిగించిందన్న చిరు.. అన్నయ్యకు అవార్డు రావడంపై తమ్ముడు పవన్ ఏమన్నారంటే??

చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నిన్న ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

Credits: TollywoodAdda

Hyderabad, Nov 21: టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) కీర్తికిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) (IFFI) చలనచిత్రోత్సవం నిన్న ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడించింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి (నవంబరు 20) నుంచి ఈ నెల 28 వరకు జరగనుంది.

వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

అవార్డు రావడంపై చిరు స్పందిస్తూ..  కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. తెలుగు చిత్రసీమలో శిఖర సమానులైన అన్నయ్య చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిరు సోదరుడు, హీరో పవన్ కళ్యాన్ అన్నారు.