Chiru Family Vacation: పారిస్ ఒలింపిక్స్ కోసం మ‌నువ‌రాలితో క‌లిసి వెళ్లిన చిరంజీవి, లండ‌న్ పార్కులో క్లింకార‌తో క‌లిసి చిరు, రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల ఫోటో వైరల్

అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Chiranjeevi with Klinkara

London, July 24: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ ఇంద్రతో మరోసారి త్వరలోనే అభిమానులకు వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఆగస్టు 22న చిరు బర్త్‌ డే (Chiranjeevi Birthday) సందర్భంగా ఇంద్ర గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే బ్యాక్‌ టు బ్యాక్ ప్రొఫెషనల్‌ కమిట్‌ మెంట్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి, రాంచరణ్‌ (Ram Charan) కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు మెగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్ ప్లాన్ వేశారు. ఇంతకీ వీళ్లెక్కడికి వెళ్లారనే కదా మీ డౌటు. వీరంతా వెళ్లిందెక్కడికో కాదు లండన్‌కు. రేపు సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్‌కెళ్లడంలో భాగంగా పారిస్‌కు (Paris Olympics) వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

 

చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది. రాంచరణ్‌ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒకటి శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్‌ ఛేంజర్‌. బుచ్చి బాబు సాన డైరెక్షన్‌లో ఆర్‌సీ 16కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. సుకుమార్ డైరెక్షన్‌లో ఆర్‌సీ 17 కూడా చేస్తున్నాడు.