Srikanth Odela Marriage: ఇంటివాడైన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన సినిమా డైరక్టర్ పై హీరో నాని స్పెషల్ ట్వీట్, ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ నాని.. మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, మీ అందరూ ఆశీర్వదించండి అని పోస్ట్ చేశాడు. దీంతో శ్రీకాంత్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది.
Hyderabad, June 01: ఇటీవల నాని(Nani) దసరా(Dasara) సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 100 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసి అదరగొట్టాడు నాని. దసరా సినిమాలో ముఖ్యంగా నాని నటన గురించే అంతా మాట్లాడుకున్నారు. ఇప్పటిదాకా నాని ఇలా కనపడలేదని, ఊర మాస్ అని అభినందించారు. నాని ని ఇలా చూపించినందుకు, ఇంత మంచి సినిమా తీసినందుకు డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్(Odela Srikanth) ని కూడా అభినందించారు. ఇది అతని మొదటి సినిమా కావడం విశేషం. దీంతో డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ మరింత ప్రమోట్ అయ్యాడు. నాని కూడా డైరెక్టర్ ని పొగుడుతూ వచ్చాడు. తాజాగా దసరా సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా ఓదెల శ్రీకాంత్ గోదావరిఖనిలో సౌమ్యకృష్ణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ నాని.. మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు, మీ అందరూ ఆశీర్వదించండి అని పోస్ట్ చేశాడు. దీంతో శ్రీకాంత్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది.
తెలంగాణ గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వచ్చాడు. సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. మొదటి సినిమా నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టాడు. దీంతో శ్రీకాంత్ ఒక్కసారిగా పాపులరయ్యాడు.