Disco Shanti on Silk Smitha: సిల్క్ స్మిత చాలా మంచిది, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు, డిస్కో శాంతి కీలక వ్యాఖ్యలు

"స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు.

Disco Shanti on Silk Smitha (photo-X/Instagram)

అలనాటి శృంగార తార సిల్క్ స్మిత గురించి డిస్కో శాంతి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. "స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ముంబైలో ఉన్న నేను షాక్ అయ్యాను. తన భర్త గురించి .. ఆ భర్తకు ఆల్రెడీ ఉన్న పిల్లలను గురించి నాతో చెబుతూ ఉండేది. నా దగ్గర ఏ విషయాలు దాచేది కాదు" అని అన్నారు.

ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు

" అప్పట్లోనే స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. ఒక రోజుకి ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకూ తీసుకునేది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. స్మిత నెలకి ఐదు లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లే కొనుక్కోవచ్చు గదా అనే దానిని.  నిజానికి ఆమెది చాలా విలాసవంతమైన జీవితం. మంచంపై డబ్బు పరుచుకుని పడుకునేది. "నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను" అని తనే చెప్పింది. సెట్లో తనని చాలా గౌరవంగా చూసేవారు" అని చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif