Evergreen Love Stories of Tollywood: తెలుగులో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రాలలో ఉండే ఆ ఫీల్ ఎప్పటికీ సజీవం.
టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి ప్రేమకథలు వచ్చాయి. కొన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అవేంటంటే...
Some love stories live forever అంటారు. అంటే కొన్ని ప్రేమకథలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి, తర్వాత ఎన్ని ప్రేమకథలు వచ్చినా అవి మాత్రం ఎవర్ గ్రీన్ (Evergreen) అని చెప్పడం అన్నమాట. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి ప్రేమకథలు వచ్చాయి. కొన్ని ప్రేమకథలు చూస్తే ఇది అచ్ఛం మనస్టోరీ లాగే ఉందని కొందరికి అనిపిస్తుంటుంది. టాలీవుడ్ మూవీస్ (Tollywood Movies) లో ప్రేమకథలు (Love Stories) ఒక సూపర్ హిట్ ఫార్ములా.
'ఆర్య' లాగా Feel My Love అంటూ, 'బొమ్మరిల్లు' లాగా Love makes life beautiful అని ప్రేమను, ప్రేమకథలను ఆస్వాదించేలా వచ్చిన కొన్ని ఫీల్ గుడ్ సినిమాలు (Feel good movies) ఇక్కడ చూడండి.
ఏం మాయ చేశావే
ChaiSam (Naga Chaitanya, Samantha) కాంబినేషన్లో వచ్చిన ఏం మాయ చేశావే సినిమా ప్రేమ యొక్క శ్రావ్యమైన గీతం (Silent melody of love) గా అభివర్ణించవచ్చు. లవ్ స్టోరీలలో ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ (fan base) ఉంది. సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలుగనే కార్తీక్ అనే ఓ అబ్బాయి, తన ఇంటి కింది పోర్షన్ లో ఉండే, అసలు సినిమాలంటేనే ఇష్టం లేని ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. రోజూ వారి చూపులు, మాటల నుంచి స్టార్ట్ అయ్యే వారి ప్రేమకథలోని ఫీల్ ఇప్పటికీ సజీవం.
ఇష్క్
బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న నితిన్ కు లక్ తీసుకొచ్చిన సినిమా ఇష్క్. ఎయిర్ పోర్టులో ఎదురుపడి ఒకరికొకరు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు డెస్టినీ వల్ల ప్రేమికులుగా ఎలా మారతారు? వారి జర్నీ ఎలా సాగుతుంది అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ లవ్ స్టోరీ చాలా మందికి వెరీవెరీ స్పెషల్.
అలా మొదలైంది
హాలీవుడ్ (Hollywood) లో వచ్చిన ‘When Harry Met Sally’ మరియు ‘A Lot Like Love’ సినిమా కథల తరహాలోనే ఈ సినిమా స్టోరీ కూడా ఉంటుంది. అనుకోకుండా కలిసిన ఇద్దరు లవ్ ఫేల్యూర్స్ వారికి తెలియకుండా ఒకరికొకరు కనెక్ట్ అయిపోతారు. తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎలా రియలైజ్ అవుతారు. మళ్ళీ ఎలా కలుస్తారు అనే నేపథంలో సాగే ఈ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
నిన్ను కోరి
ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి మంచి ఫ్యూచర్ కోసం తాను ఎంతగానో ప్రేమించే తన ప్రేయసిని వదిలేసి కెరీర్ బాట పడతాడు, తాను బాగా సెటిల్ అయి వచ్చేసరికి ఆ అమ్మాయి వేరొకరి సొంతమవుతుంది. ఇది సంక్షిప్తంగా ఈ సినిమా కథ. ఇలాంటి పరిస్థితి చాలా మందికి తమ జీవితంలో ఎదురవుతుంది. అందుకే ఈ ప్రేమకథకు చాలా మంది కనెక్ట్ అవుతారు.
అర్జున్ రెడ్డి
'ఆ పిల్ల నాదిరా' అర్జున్ రెడ్డి సినిమాలో డైలాగ్ ఇది. పైన చెప్పిన 'నిన్నుకోరి' స్టోరీకి ఇది రివర్స్. హీరో క్యారెక్టర్ తను ప్రేమించే అమ్మాయిని తన ఆస్తిగా, తన ఆత్మగా భావిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో తపిస్తాడు. ఈ సినిమాలోని ఒక్కొక్క సన్నివేషంలో ఎంతో డెప్త్ ఉంటుంది. ఇది ఒక కల్ట్ లవ్ స్టోరీ (Cult love story), ఒక ట్రెండ్ సెట్టర్.
మజిలీ
ChaiSam కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా. ఈ సినిమాను విభిన్న కోణంలో చూస్తే రెండు ప్రేమకథలు ఉంటాయి. ఇందులో పూర్ణ (నాగ చైతన్య) లవ్ స్టోరీ ఒకటైతే, అతడినే తన సర్వస్వంగా భావిస్తూ వన్ సైడ్ లవ్ చేసే శ్రావణి (సమంత) స్టోరీ చాలా ఆకట్టుకుంటుంది. చాలా మంది అబ్బాయిలు తమకు శ్రావణి లాంటి అమ్మాయే కావాలని కోరుకుంటారు. అంతలా ప్రభావితం చేస్తుంది ఆ క్యారెక్టర్.
ఇవే కాకుండా ఎటో వెళ్లిపోయింది మనసు, ఆరెంజ్, ఊహలు గుసగుసలాడే, సమ్మోహనం, ఫిదా, మళ్ళీరావా లాంటి సినిమాలతో పాటు రాజా రాణి, ప్రేమమ్ లాంటి రీమేక్ సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్ మనసును గెలుచుకున్నాయి.