Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Lavanya slaps Anchor Shekar

Hyderabad, Aug 2: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), ఆయన మాజీ ప్రియురాలు లావణ్య (Lavanya) కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది. ఇందులో రేడియో జాకీ, యాంకర్ శేఖర్ భాషాతో పాటు లావణ్య కూడా పాల్గొన్నారు. డిబేట్ సమయంలో శేఖర్ మాట్లాడుతుండగా సహనం కోల్పోయిన లావణ్య.. ఆయన్ని చెప్పుతో కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన

ఏంటీ వివాదం?

హీరో రాజ్ తరుణ్ – లావణ్య (Tarun -Lavanya) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. లావణ్యతో రాజ్ తరుణ్ చాలా కాలం పాటు సహజీవనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆమెతో 2017 నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ అంటున్నాడు. అయితే, ఏడాది క్రితం వరకు తామిద్దం కలిసున్నామని లావణ్య అంటోంది. తనకు రాజ్ తరుణ్ కావాలని వాదిస్తోంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది.

హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌కు జోడీగా మ‌రో సిటీ, కందుకూరు ద‌గ్గ‌ర కొత్త న‌గ‌రం రూపుదిద్దుకోబోతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి  

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement