CM Revanth Reddy About Group 2 Exam#Twitter)

Hyderabad, Aug 2: నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు గత ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్‌ ను (Job Calendar) నేటి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ మేరకు గురువారం కేబినేట్ ఆమోదించింది. ఈ మేరకు  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు.

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. 

తెల్ల రేషన్ కార్డులు కూడా

ప్రజలకు తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను కూడా సర్కారు త్వరలో ప్రారంభించనున్నది. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని పొంగులేటి తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై కూడా అసెంబ్లీలో నేడు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌కు జోడీగా మ‌రో సిటీ, కందుకూరు ద‌గ్గ‌ర కొత్త న‌గ‌రం రూపుదిద్దుకోబోతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి