Rahul Ramakrishna: 'నాపై చిన్నతనంలో అత్యాచారం జరిగింది', తనపై జరిగిన దారుణాన్ని బయటకు వెల్లడించిన నటుడు రాహుల్ రామకృష్ణ, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు హితవు
ఆయన ధైర్యంగా చెప్పిన విషయాల పట్ల నెటిజన్లు ఆయనను ప్రశంసితున్నారు. కొంత మంది తాము కూడా బాధితులమే అంటూ పేర్కొన్నారు. వారికి రాహుల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి దారుణాలు మిమ్మల్ని బాధితులుగా మార్చవు, మీరు యుద్ధంలో గాయపడిన యోధులు....
అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ బెస్ట్ ఫ్రెండ్‌గా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టాలెంటెడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) , తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి బయటకు చెప్పుకున్నారు. తనపై జరిగిన ఆ దారుణం పట్ల జీవితంలో తానెంత క్షోభ అనుభవించాడో ట్విట్టర్ వేదికగా వివరించారు. చిన్నతనంలో తనపై అత్యాచారం (rape) జరిగిందని, ఆ బాధ గురించి ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదని రాహుల్ అన్నారు. 'తలుచుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది, దారుణం అని అనిపిస్తుంది. ఆ నేరం నా జీవితాన్ని ఎప్పుడూ వెంటాడుతుంది, కానీ దానికి న్యాయం ఎప్పటికీ జరగదు. కేవలం కాలంతో పాటు కలిగే తాత్కాలిక ఉపశమనం తప్ప. మీ కుటుంబంలోని మగవారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా నేర్పించండి'. అని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఆ అఘాయిత్యానికి పాల్పడిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.
రాహుల్ ట్వీట్ కు మద్ధతుగా చాలా మంది ట్వీట్ చేశారు. ఆయన ధైర్యంగా చెప్పిన విషయాల పట్ల నెటిజన్లు ఆయనను ప్రశంసితున్నారు. కొంత మంది తాము కూడా బాధితులమే అంటూ పేర్కొన్నారు. వారికి రాహుల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి దారుణాలు మిమ్మల్ని బాధితులుగా మార్చవు, మీరు యుద్ధంలో గాయపడిన యోధులు, ధైర్యంగా ఉండండి, సమాజం కట్టుబాట్లను తెంచేయండి అంటూ చెప్పారు.
అలాగే పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే గమనించాలి. ఎప్పుడైనా భయానికి లోనైతే దానిని బయటకు చెప్పుకునేంత నైపుణ్యం వారి దగ్గర ఉండదు, కాబట్టి తల్లిదండ్రులే అడిగి తెలుసుకోవాలన్నారు. మగాడిపై 5గురు సామూహిక అత్యాచారం, బాధితుడికి అత్యవసర సర్జరీ
29 ఏళ్ల రాహుల్ సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పనిచేశారు, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'.