Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..
ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..
Hyderabad, September 26: ప్రముఖ తెలుగు కథానాయకుడు రామ్ చరణ్ (Ram Charan) ఇంట భారత క్రికెటర్లు (Indian Cricketers) దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 (T20) మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ చక్కని విజయం సాధించడం తెలిసిందే. హైదరాబాద్ కు విచ్చేసిన భారత క్రికెటర్లను రామ్ చరణ్ ఈ సందర్భంగా తన ఇంటి రావాలని ఆహ్వానించారు. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు. క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు.
చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. ఈ ఫొటోలను రామ్ చరణ్ అధికారికంగా విడుదల చేయనున్నట్టు తెలిసింది.