Actor Irrfan Khan Passes Away: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత, కన్నతల్లిని కడసారి కూడా చూడలేకపోయిన బాలీవుడ్ నటుడు, పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు
గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో (Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital) తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం చివరిగా ఆంగ్రేజీ మీడియం (Angrezi Medium) సినిమాలో నటించారు.
ప్రముఖ్ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) (Irrfan Khan Passes Away) ఇకలేరు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో (Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital) తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం చివరిగా ఆంగ్రేజీ మీడియం (Angrezi Medium) సినిమాలో నటించారు.
అనారోగ్యానికి గురయినప్పటి నుంచి చివరి సినిమా ప్రమోషన్లకు ఇర్ఫాన్ దూరంగా ఉన్నారు. మంగళవారం ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్ బాలీవుడ్ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. ఆయన మృతితో బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్ ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు.
Irfan Khan beautiful performances
Here's Anupam Kher Tweet
ఇదిలా ఉంటే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. తల్లి చనిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే ఇర్ఫాన్ ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత అవుతున్నారు. ఇద్దరి అగ్ర హీరోల ఫ్యాన్స్ వివాదం, ఒకరిని హత్య చేసిన మరొకరు, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన మరకనం పోలీసులు
పాన్ సింగ్ తోమర్ (Paan Singh Tomar) సినిమాకు గాను ఇర్ఫాన్ ఖాన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. అంతేకాదు తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ తన సినీ జీవితాన్ని 1988 సంవత్సరంలో సలాం బాంబే చిత్రంలో చిన్న పాత్రతో ప్రారంభించాడు. ఆ తరువాద, ఏక్ డాక్టర్ కి మౌట్, బడా దిన్, దృష్టీ వంటి కొన్ని సినిమాల్లో పని కొనసాగించాడు.
Irfan Khan Speech
2003 లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన మక్బూల్ తో అతని పురోగతి వచ్చింది. స్లమ్‌డాగ్ మిలియనీర్, హైదర్, పికు, హిందీ మీడియం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. పాన్ సింగ్ తోమర్ (2011) లో అతని పాత్ర ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. అతని చివరి విడుదల ఆంగ్రేజీ మీడియం, ఇది కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా థియేటర్లలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.