IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)

మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

IT Raids In Pushpa-2 Producer Houses (Credits: X)

Hyderabad, Jan 21: మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు (IT Raids) టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. అలాగే ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

వీళ్ల ఇండ్లల్లో కూడా

దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement