Rocking Rakesh Movie: కేసీఆర్ పేరుతో సినిమా, ఆ పేరుతో సాహసం చేస్తున్న జబర్ధస్త్ కమెడియన్, ఇంతకీ కేసీఆర్ అంటే పూర్తి అర్ధం ఏంటో తెలుసా?

ఈ సినిమాకి ‘KCR’ అనే టైటిల్ ని పెట్టారు. కేసీఆర్ అంటే ‘కేశవ చంద్ర రామావత్’ అని (KCR) అర్ధం. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కట్ అవుట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు.

Rocking Rakesh Movie (PIC@ Vamshi Kaka X)

Hyderabad, OCT 13: బ‌జ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్‌ (Rocking Rakesh).. ఇప్పుడు హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు అంజి (Anji) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెర‌కెక్కుతోంది. పూజా కార్యక్రమాలతో ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ.. సైలెంట్ గా షూటింగ్ ని పూర్తి చేసుకొంటుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ని ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ తోనే మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్న రాకేష్. ఈ సినిమాకి ‘KCR’ అనే టైటిల్ ని పెట్టారు. కేసీఆర్ అంటే ‘కేశవ చంద్ర రామావత్’ అని (KCR) అర్ధం. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

 

తెలంగాణ సీఎం కేసీఆర్ కట్ అవుట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ జరగబోతుందని తెలుస్తుంది. మొదటి సినిమాకే రాకేష్ ఇలాంటి టైటిల్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

 

కాగా ఈ సినిమాలో రాకింగ్ రాకేష్‌ కి క‌థ‌నాయిక‌గా అనన్య (Ananya) న‌టిస్తోంది. చరణ్ అర్జున్ (Charan Arjun) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొందించబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ పల్లెటూరి కథాంశంతో వచ్చిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని చూస్తుందో చూడాలి.