Jailer Movie Review: జైలర్ సినిమాతో రజనీకాంత్ హిట్ కొట్టాడా, సినిమా కథనం ఎలా ఉంది, పాత్రలు ఎవరివి ఎలా ఉన్నాయి, తలైవా జైలర్ రివ్యూ ఇదిగో..
తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై చాలా బజ్ క్రియేట్ అయింది. జైలర్ తో తలైవా హిట్ అందుకున్నాడా? సినిమా ఎలా ఉంది? రజనీకాంత్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన ఈ చిత్రం నేడు ధియేటర్లలో విడుదలైంది.
చాలా రోజుల నుంచి తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ కోసం చూస్తున్నాడు. తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై చాలా బజ్ క్రియేట్ అయింది. జైలర్ తో తలైవా హిట్ అందుకున్నాడా? సినిమా ఎలా ఉంది? రజనీకాంత్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన ఈ చిత్రం నేడు ధియేటర్లలో విడుదలైంది.
రజనీకాంత్ (Rajinikanth) సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు వారూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలుగులో ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. రెండేళ్ల కిందట వచ్చిన ‘పెద్దన్న’ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ క్రమంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌కు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రజనీకాంత్.
ఇక ప్రచార చిత్రం చూసిన తర్వాత పాత రజనీని గుర్తు చేశారు. మరి ‘జైలర్’లో రజనీ పాత్ర ఏంటి? (Jailer movie review) ఆయన శత్రువులపై ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? అభిమానులు ఆశించే అన్ని అంశాలను మేళవించి నెల్సన్ ఎలా ఈ మూవీని తెరకెక్కించారు? రివ్యూ (Jailer Telugu Movie Review) ఓ సారి చూద్దాం.
నటీనటులు: రజినీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు, తమన్నా భాటియా, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాత: కళానిధి మారన్ సినిమాటోగ్రఫి: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటింగ్: ఆర్ నిర్మల్ మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్ బ్యానర్: సన్ పిక్చర్స్ రిలీజ్ డేట్:
సినిమా కథేంటి..
ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. నిజాయితీగా ఉద్యోగం చేసే తన కొడుకును చంపిన మాఫియా ముఠాపై ముత్తు ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్దమవుతాడు? ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే.
జైలర్ ముత్తు గత జీవితం ఏమిటి? తీహార్ జైలులో ముత్తు ఉద్యోగం ఎలా చేశాడు? ముత్తుకు నరసింహ (శివరాజ్ కుమార్)కు కనెక్షన్ ఏమిటి? ముత్తుకు మ్యాథ్యూస్ (మోహన్ లాల్) సంబంధమేమిటి? ఉత్తరాదిలో మాఫియా డాన్ (జాకీ ష్రాఫ్)తో ముత్తుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? మంగళగిరిలోని ఆలయానికి సినీ నటుడు బ్లాస్ మోహన్ (సునీల్)కు సంబంధం ఏమిటి? సినీ నటుడు బ్లాస్ మోహన్‌కు కామ్నా (తమన్నా భాటియా)కు సంబంధం ఏమిటి? మంగళగిరి ఆలయంలోని అరుదైన కిరిటాన్ని ముత్తు ఎందుకు దొంగిలించాలని ప్లాన్ చేశాడు? విగ్రహాల అక్రమ రవాణా చేసే మాఫియా ముఠా నాయకుడి సామ్రాజ్యాన్ని ముత్తు ఎలా దెబ్బ తీశాడు? మరణించిన తన కొడుకుకు సంబంధించిన ఓ షాకింగ్ నిర్ణయం తెలిసిన తర్వాత ముత్తు ఎలాంటి ప్లాన్ వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే జైలర్ సినిమా కథ.
ఎలా ఉందంటే: మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి కథ ఇది. రజనీకాంత్ మార్క్ మాస్ స్టైల్, హీరోయిజమే ప్రధానంగా సాగుతుంది. ఒక్క మాటలో ఆయన వన్ మ్యాన్ షో ఇది.పాత్రల్ని పరిచయం చేయడానికి సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తర్వాత అసలు కథని మొదలుపెట్టాడు ఫస్టాప్ అంత ధ్రిల్లింగ్ సెకండాఫ్ లో కొరవడినట్లు కనిపిస్తుంది. రజనీ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కూడా అంతగా మెప్పించవు. పైగా బలహీనంగా కనిపించే రజనీకి ఆ గెటప్ అంతగా అతకలేదు.
అయితే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే మలుపు తర్వాత మళ్లీ సినిమా గాడిన పడుతుంది. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్‌ల అతిథి పాత్రలు సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం అంతంత మాత్రమే అనిపించినా... రజనీ తనదైన నటనతో సినిమాని నిలబెట్టారు. అభిమానులకైతే ఈ సినిమా మరింత కిక్ ఇస్తుంది.