Jolly Bastian Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ స్టంట్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌, సంతాపం తెలిపిన ప్రముఖులు

యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరొందిన జాలీ బాస్టియ‌న్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Jolly Bastian (Photo Credits: IANS)

ప్ర‌ముఖ క‌న్న‌డ స్టంట్ మాస్ట‌ర్ జాలీ బాస్టియ‌న్ (Jolly Bastian) గుండెపోటుతో బెంగ‌ళూర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరొందిన జాలీ బాస్టియ‌న్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మలో ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.జాలీ మ‌ర‌ణం ప‌ట్ల న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఆర్ఐపీ జాలీ మాస్ట‌ర్‌, మీరు ఎప్పుడూ న‌వ్వుతూ, అంద‌రినీ ప్రోత్స‌హిస్తూ ద‌య‌తో వ్య‌వ‌హ‌రించేవార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా గుర్తుచేసుకున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, జాలీ మాస్ట‌ర్ గ‌తంలో 2014లో బెంగ‌ళూర్ డేస్ మూవీకి క‌లిసి ప‌నిచేశారు.దాదాపు 900కుపైగా ద‌క్షిణాది సినిమాలకు ఆయన పనిచేశారు.

Here's IANS Tweet