Darshan's Farmhouse Manager Dies By Suicide: కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్, ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు ఫామ్‌హౌస్ మేనేజర్
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తుండగానే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.
విపరీతమైన ఒంటరితనం కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. దర్శన్ మాజీ మేనేజర్ మల్లికార్జున్ 2018 నుండి తప్పిపోయాడని నివేదికలు పేర్కొన్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది. తరువాతి వ్యక్తి పారిపోయి కనిపించకుండా పోయే ముందు నటుడి నుండి రూ. 2 కోట్లు దొంగిలించాడని నివేదించబడింది. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమిళ నటుడు ప్రదీప్ విజయన్, గుండెపోటుకు గురయ్యాడని వార్తలు
స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో కన్నడ నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్‌లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.
దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉండటంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి' గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్
'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.