Karthik Aryan: సినిమా కోసం ఏకంగా సంవత్సరం పాటూ చక్కెరకు దూరంగా ఉన్న హీరో, షూటింగ్ పూర్తవ్వడంతో రసమలై తిని సెలబ్రేషన్స్
షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంలో తనకెంతో ఇష్టమైన రసమలై రుచి చూసారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ స్వయంగా కార్తీక్‌కి తినిపించారు
Mumbai, FEB 02: బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో (Kabir Khan) నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) చేస్తున్న సినిమా ‘చందు ఛాంపియన్’ (Chandu Champion) షూటింగ్ పూర్తైంది. ఒక క్రీడాకారుడి నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా తీపి రుచి చూడలేదట. షూటింగ్ పూర్తైన నేపథ్యంలో కబీర్ ఖాన్ కార్తీక్‌కి ఎంతో ఇష్టమైన రసమలై తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న ‘చందు ఛాంపియన్’ (Chandu Champion) సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ సంవత్సరం పాటు షుగర్ లేని డైట్ పాటించారట. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంలో తనకెంతో ఇష్టమైన రసమలై రుచి చూసారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ స్వయంగా కార్తీక్‌కి తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోను కార్తీక్ ఆర్యన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ‘రసమలై తింటుంటే విజయం సాధించినంత ఆనందంగా ఉంది. ఫైనల్లీ ఏడాది తర్వాత తీపి రుచి చూస్తున్నాను. 8 నెలలు రాత్రి, పగలు షూటింగ్స్‌తో చందు ఛాంపియన్ సినిమా కంప్లీట్ అయ్యింది. ఆ సమయం రసమలై తిన్నంత తీయగా అయితే లేదు. సవాల్‌తో కూడిన మార్గాన్ని చూపించిన వ్యక్తి నుండి నేను పొందిన ప్రేరణ’ అంటూ తన కార్తీక్ తన పోస్టుకు శీర్షికను యాడ్ చేసారు.
అయితే ఒక ఏడాది పాటు షుగర్ తీసుకోకపోవడం వల్ల అది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అన్శది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చక్కెరను పూర్తిగా మానేయడం, లేదా పరిమితం చేయడం వల్ల అది సానుకూల మార్పులకు దారి తీయవచ్చునట. ముఖ్యంగా జీవక్రియ మెరుగుపడటం, ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాల నుంచి కాపాడుతుందట. చర్మ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందట. మొటిమలు తగ్గడంతో పాటు యవ్వనంగా కనిపిస్తారట. ఈ విషయాలను అహ్మదాబాద్‌లోని జైడస్ హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ శృతి కె.భరద్వాజ్ చెప్పారు. అంతేకాదు చక్కెర తగ్గించడం వల్ల రక్తపోటు తగ్గడం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం వంటివి జరుగుతాయని కూడా చెప్పారు. అయితే ఒక పాత్రలో నటించడానికి నటుడు కార్తీక్ ఆర్యన్ ఇంత కఠినమైన డైట్ ఫాలో అవ్వడం అంటే నిజంగా సవాల్ అని చెప్పాలి.