Allu Arjun: కేరళ వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, రూ. 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటన
ముఖ్యంగా వయనాడు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకు వస్తున్నారు.
Hyd, Aug 4: భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకు వస్తున్నారు.
తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రజలు ఎప్పుడైన తనపై అంతులేని అభిమానాన్ని చూపారని వారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకే, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా బలగం, ఇంకా అవార్డులు ఎవరెవరికి అంటే?
Here's Tweet:
ఇప్పటివరకు సినీ రంగానికి చెందిన మోహన్ లాల్ రూ. 3 కోట్లు, సూర్య జ్యోతి దంపతులు 50 లక్షలు , మమ్ముట్టి ,దుల్కర్ సల్మాన్ కలిపి రూ. 40 లక్షలు,కమల్ హాసన్ 25 లక్షలు, ఫహాద్ ఫాజిల్ 25 లక్షలు, చియాన్ విక్రమ్ 20 లక్షలు,రష్మిక మందన్న 10 లక్షలు విరాళంగా అందించారు.