Maa Elections: హడావుడి లేకుండా సైలెంట్ గా పూర్తయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు, పాత కార్యవర్గాన్నే ఏకగ్రీవంగా ఎన్నికున్న సభ్యులు
అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు.
Hyderabad, April 07: టాలీవుడ్ లో ప్రతి రెండేళ్లకు ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జరుగుతాయి అన్న విషయం అందరికి తెలిసిందే. 1993లో మొదలైన ఈ అసోసియేషన్ ఎన్నికలు.. ప్రతిసారి ప్రశాంతంగానే జరుగుతూ వచ్చాయి. కానీ 2019, 2021 ఎన్నికలు మాత్రం కొన్ని గొడవలతో జరిగాయి. గత ఎన్నికల్లో మంచు విష్ణు (Manchu Vishnu), ప్రకాష్ రాజు పోటీ పడ్డారు. అయితే ఈ పోటీ వీరిద్దరి మధ్య కాకుండా మంచు అండ్ మెగా ఫ్యామిలీ మధ్య అన్నట్లు సాగింది. దీంతో గత మా ఎన్నికలు (Maa Elections) అసెంబ్లీ ఎన్నికల మాదిరి జరిగాయి. గొడవలు, ఆరోపణలతో టాలీవుడ్ లో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. ఇక ఆ ఎన్నికలు అంత రచ్చ రచ్చ మీద జరిగితే.. ఈ విడత ఎన్నికలు ఏమో ఎటువంటి హడావుడి లేకుండా ఏకగ్రీవంగా పూర్తీ అయ్యాయి. 26 మంది కమిటీ సభ్యులు కలిసి ఈసారి ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించారు.
మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి (Maa Elections) పదవిని అందించారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు. ఇక మరోసారి అధ్యక్షుడిగా ఎంపికైన విష్ణు.. మా అసోసిషన్ నూతన భవనం నిర్మించే వరకు తానే అధ్యక్షుడిగా ఉంటాను అంటూ తీర్మానం చేశారు. అంతేకాదు ఈసారి మూడేళ్ళ వరకు ఎన్నికల జరిగే అవకాశం లేదని. ఐదేళ్లు పాటు ఒక్కే అదేక్షుడు కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని పేర్కొన్నారు.