Nagarjuna's Wild Dog Movie: ఏప్రిల్‌ 2న విడుదల కానున్న నాగార్జున వైల్డ్ డాగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి, ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున సరికొత్త గెటప్, అదే రోజు కార్తి ‘సుల్తాన్’ సినిమా కూడా విడుదల

ఇది నాగార్జునకు 40వ చిత్రం. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో (Nagarjuna's Wild Dog) ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

Nagarjuna With Wild Dog Team (Photo Credits: Twitter

కొత్త డైరక్టర్లను తెలుగు తెరకు పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ‘శివ’ నుండి కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వరకు ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన కింగ్ ‘వైల్డ్ డాగ్’ తో (Nagarjuna's Wild Dog Movie) అహిసోర్ సాల్మన్‌ను పరిచయం చేస్తున్నారు. ఇది నాగార్జునకు 40వ చిత్రం.

ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో (Nagarjuna's Wild Dog) ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా సినిమా (Wild Dog) సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. హైదరాబాద్‌ గోకుల్‌ చాట్‌ సహా దేశంలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ల కేసును ఎన్‌ఐఏ టీమ్‌ను ఎలా చేధించిందనే కథాంశంతో 'వైల్డ్‌డాగ్‌' సినిమా తెరకెక్కింది.

సినిమా హైదరాబాద్‌ సహా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది. ఈ చిత్రంలో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా యాక్షన్ రోల్ చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు.

Movie Release Date

తానెప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటానని, ‘ఊపిరి’ లో నాకు తమ్ముడిగా నటించిన కార్తి ‘సుల్తాన్’ సినిమా కూడా ఏప్రిల్ 2నే రిలీజవుతోంది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని నాగ్ అన్నారు. నాగార్జున గారు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఇండస్ట్రీలో ఎవరు కొత్త కాన్సెప్ట్ రెడీ చేసినా మందు నాగార్జున గారికే వినిపిస్తారు. ఈ సినిమాతో నాగ్ సార్ పరిచయం చేస్తున్న 40వ దర్శకుడు సాల్మన్ (AHISHOR SOLOMON) అని నిర్మాత నిరంజన్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 2న బాక్సాఫీస్ వద్ద ‘వైల్డ్ డాగ్’ హంటింగ్ స్టార్ట్ కానుంది.



సంబంధిత వార్తలు