Balakrishna 108th Film Title: బాలయ్య 108 మూవీ టైటిల్ ఖరారు, బర్త్‌ డే కు రెండు రోజుల ముందే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌, భగవంత్ కేసరిగా ముందుకొస్తున్న నటసింహం

గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavant kesari) అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు.

Balakrishna 108th Film (PIC@ Twitter)

Hyderabad, June 08: గాడ్ ఆఫ్ మాసెస్, నట‌సింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయుడిగా నటిస్తున్న 108వ చిత్రానికి టైటిల్ (Nandamuri Balakrishna Movie) ఖారారైంది. గురువారం ఉదయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య సినిమాకు ‘భగవంత్ కేసరి’ (Bhagavant kesari) అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు. షైన్ స్క్రీన్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో సినిమా పేరుతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ ’ అని శీర్షిక ఇచ్చారు. బాలయ్య 108వ (Balakrishna 108) సినిమా టైటిట్ ఫవర్ ఫుల్‌గా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న బాలయ్యకు (Nandamuri Balakrishna) మరో హిట్ ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్100 కోట్ల సూపర్ హిట్ సినిమాలు సాధించారు. ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.  కామెడీ సినిమాలు చేసే అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో మాస్ సినిమాలు చేసే బాలయ్య సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు.

Prabhas Comments On Marriage: నా పెళ్లి తిరుపతిలోనే! కృతి సనన్ పక్కన ఉండగానే ఆదిపురుష్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పెళ్లిపై స్పందించిన ప్రభాస్ 

ఆల్రెడీ NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టడంతో బాలయ్య అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉండటంతో ఆ రోజు టైటిల్ ని ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే అభిమానులకి జోష్ ఇచ్చింది చిత్రయూనిట్.