Niharika Konidela Re Entry: రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, చాలాగ్యాప్‌ తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మెగా డాటర్, ఇతరులు ఏం చేస్తున్నారన్నది సంబంధం లేదంటూ పోస్ట్

ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

Hyderabad, April 30: మెగా డాటర్ నిహారిక (Niharika) తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లతో (Web series) పాటు నిర్మాతగా కూడా చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అయితే సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ లో (YouTube), నిర్మాతగా మాత్రం ముందుకెళ్తుంది. మధ్యలో సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకుంది. అయినా పెళ్లి (Marriage) తర్వాత కూడా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్ లలో నటిస్తానని, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తానని గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక (Niharika) లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ డిలీట్ చేసింది. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు.  తమకి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే తెలియచేస్తారు.

RIP Shyam Siddhartha: డాడీ, లవ్‌ యూ..మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను, తండ్రి గురించి ఎమోషనల్‌ అయిన నిఖిల్‌

కానీ.. నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ (Instagram Account) చేసింది. అప్పుడు ఎందుకు ఆమె డిలీట్ చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు. ముఖ్యంగా మెగా అభిమానులు నిహారికా ఇన్ స్టాకు దూరమవడంతో తెగ బాధ పడిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

అయితే.. నిహారిక తాజాగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ (Instagram Re Entry) ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నిహారికా రీ ఎంట్రీతో మెగా అభిమానులు ఆమెకు మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif